News

గుజరాత్ లో పాఠశాల సిలబస్ కు అనుబంధంగా భగవద్గీత పుస్తకాన్ని ఆవిష్కరించిన విద్యాశాఖ

229views

గుజరాత్ ప్రభుత్వం 6వ తరగతి నుంచి 8వ తరగతి పాఠశాల సిలబస్ కు అనుబంధంగా ‘భగవద్గీత’పై పాఠ్య పుస్తకాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు పుస్తకాన్ని ఆవిష్కరిం చగా వచ్చే ఏడాది నుంచి ఇది అమలుకానుంది. విద్యార్థులను భారతదేశ గొప్పదైన, వైవిధ్యమైన, పురాతన సంస్కృతికి, జ్ఞాన వ్యవస్థలకు అనుసంధా నించే లక్ష్యం ఇందులో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పనసెరియా అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఐపీ)కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీన్ని మొదటి భాగంగా 6-8 తరగతుల విద్యార్థుల కోసం తెచ్చామని, త్వరలో 9-12 తరగతుల వారికి మరో రెండు భాగాలుగా అందుబాటులోకి తెస్తామని పనసెరియా పేర్కొన్నారు