News

అమెరికాలో హిందూ దేవాలయం గోడలపై ఖలిస్తానీ నినాదాలు

301views

అమెరికాలో సిక్కు వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ్ మందిర్ వసాన సంస్థ గోడలపై ఖలిస్తానీ అనుకూల రాతలు రాశారు. ప్రధాని మోదీపై విద్వేష పూరిత రాతలు కూడా రాసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలను హిందూ అమెరికా ఫౌండేషన్ ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది. నెవార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, సివిల్ రైట్స్ డివిజన్‌‌కు ఫిర్యాదు అందినట్టు కూడా వెల్లడించింది. ఈ ఘటనను ద్వేషపూరిత నేరంగా పరిగణించి దర్యాప్తు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

కాగా, గతంలోనూ అమెరికాతో పాటూ పొరుగు ఉన్న కెనడాలో హిందూ వ్యతిరేక ఘటనలు వెలుగు చూశాయి. కెనడాలోని సర్రీ నగరంలోగల ఇటీవల ఓ దేవాలయం గోడలపై ఆగంతుకులు విద్వేషపూరిత రాతలు రాసారు. ఖలిస్థానీ వేర్పాటు వాది నిజ్జర్ హత్యకు సంబంధించిన నిరసనల ఫొటోలను గుడి తలుపులపై అతికించారు.

‘గుడి గోడలపై ఖలిస్తానీ ఉగ్రవాది జర్నెయిల్‌ సింగ్‌ బింద్రాన్‌వాలే పేరు రాశారు. ఇది గుడికి వచ్చే వారిని భయాందోళనలకు గురి చేయడమే. ఇది హేట్‌ క్రైమ్‌ కిందకే వస్తుంది. ఈ రాతలపై పోలీసులు దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం’అని హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ ట్వీట్‌లో కోరింది.