News

ఏబీవీపీ కార్యకర్తపై ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మూకదాడి

322views

ఎస్ఎఫ్ఐ విద్యార్థుల దాడిలో ఏబీవీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. బాధితుడు శ్రీదేవ్ త్రిసూర్ జిల్లాలోని కున్నంకుళం పట్టణంలోని శ్రీ వివేకానంద కాలేజీలో మొదటి సంవత్సరం గ్రాడ్యుయేట్ విద్యార్థి. ఇతడు ఏబీవీపీ కార్యకర్త కూడా. ఉదయం కాలేజీకి వెళ్లగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు దాడి చేశారు. ఎస్ఎఫ్ఐ యూనిట్ ప్రెసిడెంట్, సెక్రటరీ ప్రోద్భలంతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాడి ఘటనలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు మలంకర హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నాడు.