News

శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ..అమెరికాలో వారంపాటు సంబరాలు

239views

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి అమెరికా ముస్తాబవుతోంది. జనవరి 15న మొదలుకొని వారం రోజులపాటు రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలను నిర్వహించనున్నట్లు ఇక్కడి హిందూ ఆలయాల సాధికారిక మండలి(హెచ్‌ఎమ్‌ఈసీ) వెల్లడించింది. వారంపాటు జరగనున్న ఈ సంబరాలº్ల చిన్నా, పెద్ద ఆలయాలన్నీ పాలుపంచుకోనున్నాయి. జనవరి 15 నుంచి ప్రారంభంకానున్న వేడుకలకు ఇప్పటికే కొన్ని ఆలయాలు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు మండలి తెలిపింది. వేడుకల్లో మొదటిరోజు శ్రీరాముడి సంకీర్తనలతో పాటు, వాల్మీకి రామయణంలోని 108 రాముడి పేర్లను పఠించనున్నట్లు మండలి పేర్కొంది. ‘రామాయణ్‌ అరౌండ్‌ ది వరల్డ్‌’ అనే పేరుతో ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లుగా తెలిపింది. 26 పోస్టర్లతో ఉన్న ఈ ప్రదర్శన దేశవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడి ప్రాముఖ్యతను తెలుపనుంది. స్థానిక ఆలయాల్లో ఈ ప్రదర్శనను తిలకించవచ్చు.