News

జ్ఞానవాపి మసీదుపై నివేదిక సమర్పించిన ఏఎస్‌ఐ

355views

జ్ఞానవాపి మసీదుపై శాస్త్రీయ సర్వే నిర్వహించిన భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ) తన నివేదికను సోమవారం వారణాసి జిల్లా న్యాయస్థానానికి సమర్పించింది. దీనిపై తదుపరి విచారణ 21న జరపనుంది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని మందిరం పక్కన ఉన్న జ్ఞానవాపి మసీదును 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూలగొట్టి నిర్మించారా లేదా అని నిర్ధారించేందుకు కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ ఈ సర్వే నిర్వహించింది. మరోవైపు మథురలోని శ్రీకృష్ణజన్మభూమి ఆలయం పక్కన ఉన్న షాహీ-ఈద్గా మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే నిర్వహణకు ఆదేశించిన అలహాబాద్‌ హైకోర్టు.. అందుకోసం రూపొందించాల్సిన విధి విధానాలపై విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది.