
297views
ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రమైన స్వర్‌వేద్ మహామందిరాన్ని ప్రారంభించారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఈ కేంద్రాన్ని పరిశీలించారు. ఒకేసారి 20వేల మంది ఏకకాలంలో ధ్యానం చేసుకునేందుకు వీలుగా దీనిని నిర్మించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఇక్కడ గడిపే ప్రతిక్షణం అద్భుతంగా ఉంటుంది. కాశీ నాకెప్పుడూ సొంతింటికొచ్చిన అనుభూతినిస్తుంది. సాధువుల మార్గదర్శకత్వంలో నూతన నిర్మాణాలు, అభివృద్ధి విషయంలో కాశీ ప్రజలు సరికొత్త రికార్డులు సృష్టించారు. అందుకు ఈ మహామందిరం ఓ నిదర్శనం’ అని వెల్లడించారు.





