News

ఆలయంలో అలజడి..మహా హారతికి అడ్డంకి..

222views

పంజాబ్ రాష్ట్రం లూథియానాలోని గోపాలుడి ఆలయంలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి అరాచకం సృష్టించారు. పాదరక్షలు ధరించి ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా దేవతా మూర్తికి మహా హారతిని నివేదించకుండా అడ్డుకున్నారు. నిందితుల దుశ్చర్యపై సమాచారం అందుకున్న కొందరు స్థానికులు ఆలయంలోకి వస్తున్న విషయాన్ని గమనించిన దుండగులు అక్కడ నుంచి జారుకున్నారు.

మహా హారతికి అడ్డుతగిలిన దుండగులను ఆలయ పూజారి ప్రశ్నించడంతో ఆయన పై ఎదురు తిరిగారు. ఆలయంలోకి విగ్రహాలను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించినట్లు పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. తమ మనోభావాలు దెబ్బ తినే విధంగా ప్రవర్తించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక హిందువులు డిమాండ్ చేశారు. ఆలయంలో అలజడి సృష్టించినవారు స్థానికులే అని కొందరు అనుమానాలు వ్యక్తం చేయడం విశేషం.