
1.3kviews
హిందూ సంస్కృతి పరిఢవిల్లినన్ని రోజులు ఛత్రపతి శివాజీ పేరు ప్రజల గుండెల్లో ఉంటుందని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డా .సునీల్ రెడ్డి గారు పేర్కొన్నారు.
ఒంగోలు నగరంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆధ్వర్యంలో మరాఠీపాలెం లోని శివాజీ విగ్రహం వద్ద హిందూ సామ్రాజ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దక్షిణాపథంలో మొఘల్ పాలకులకు ఎదురొడ్డినిలచి స్వతంత్ర హిందూరాజ్య స్థాపన చేసిన యోధుడు శివాజీ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా నగరమరాఠీ సంఘ అధ్యక్షుడు శ్రీ కాలే వెంకటేశ్వరరావు గారు పాల్గొనగా,RSS ప్రకాశం విభాగ్ సంఘ చాలక్ మాననీయ మండవ నాగేశ్వరరావు గారు, ఒంగోలు జిల్లా సంఘచాలక్ మాననీయ డాక్టర్ సునీల్ రెడ్డి గారు,నగర సంఘచాలాక్ మాననీయ పాబోలు ఈశ్వరయ్య గారు,ముఖ్య వక్తగా నగర సేవాప్రముఖ్ శ్రీ విజయభాస్కర్ గారు హిందూ ధర్మసంస్థల ప్రతినిధులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.





