News

క్రైస్తవుడే ముఖ్యమంత్రిగా ఉండాలి : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు

402views

రాష్ట్రంలో ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. క్రైస్తవుడైన వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని తాను బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. కాకినాడ సిటీలో క్రైస్తవ సువార్త సభలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా తాను, రూరల్ ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు, సీఎంగా వైఎస్ జగన్ ఉన్నారంటూ అందుకు క్రైస్తవులే కారణం అని అన్నారు.

కన్నబాబు ఒక మాజీమంత్రిగా.. నేను ఎమ్మెల్యేగా.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అందరం ఉన్నాం అంటే అందుకు మీ ఆశీర్వాదాలు.. మీ యెుక్క ప్రార్థనలు..దేవుడి మెుక్క బలం అని ఖచ్చితంగా చెప్తున్నానని అన్నారు. ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలన్నది నా కోరిక అని, క్రైస్తవుడు అయిన వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ‘జగన్‌ సీఎంగా ఉంటే మనం ఎంత బలంగా ఉండొచ్చో పాస్టర్లందరికీ తెలుసు. మనం స్వేచ్ఛగా ఉండాలన్నా, ప్రార్థనలు చేసుకోవాలన్నా సీఎంగా జగన్‌ ఉండాలి. రాబోయే రోజుల్లో క్రైస్తవవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.