News

తిరుమలలో ఆచారాలను నాశనం చేస్తున్న ప్రభుత్వం : రమణ దీక్షితులు

271views

టీటీడీ అధికారులపై తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఎక్స్‌ (ట్విటర్‌)లో పలు ఆరోపణలు చేశారు. వాటిని ప్రధాని మోదీకి ట్యాగ్‌ చేశారు. మోదీ సోమవారం శ్రీవారిని దర్శించుకున్న నేపథ్యంలో రమణదీక్షితులుఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘భారత ప్రధానికి శుభోదయం. తిరుమల శ్రీవారి ఆలయ పరిపాలనను హిందూయేతర అధికారి, రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా నాశనం చేస్తున్నారు. సనాతన ఆచారాలు, తితిదే పరిధిలోని పురాతన నిర్మాణాల ధ్వంసం సాగుతోంది. వాటి నుంచి రక్షించి తిరుమలను హిందూ రాష్ట్రంగా అత్యవసరంగా ప్రకటించాలి. శ్రీవారి ఆశీస్సులు మీకుంటాయి.’ అంటూ ట్వీట్‌ చేశారు.కొంతసేపటికి రమణదీక్షితులు తన ట్వీట్‌ను తొలగించారు. గతంలోనూ ఇదే తరహాలో ట్వీట్‌లు చేసిన ఆయన ఆ వెంటనే తొలగించడం గమనార్హం.