
బీహార్ ప్రభుత్వ విద్యాశాఖ తాజాగా సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారంహిందూ పండుగలైన శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి, తీజ్, హొలీ,
వంటి రోజులలో సెలవులను రద్దు చేశారు. అదే సమయంలో ముస్లిం పండుగలకు మాత్రం ఈద్-బక్రీద్‌కు మూడు రోజులు, ముహర్రం కోసం రెండు రోజుల చొప్పున సెలవులు కేటాయించారు.
ముస్లిం పక్షపాతంతో హిందువులపై వివక్షపూరితంగా వ్యవహరిస్తూ హిందూ పండుగలలో సెలవులు రద్దు చేయడంపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మామ-మేనల్లుడు ప్రభుత్వ హయంలో హిందూ వ్యతిరేక ధోరణి మరోసారి తెరపైకి వచ్చిందని కేంద్రమంత్రి అశ్విని కె చౌబే ఎక్స్ వేదికగా స్పందించారు. ఒకవైపు పాఠశాలల్లో ముస్లింల పండుగలకు సెలవులు పొడిగిస్తూనే, హిందూ పండుగలకు సెలవులు రద్దు చేస్తున్నారన్నారు.ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సనాతన ధర్మాన్ని ద్వేషిస్తున్న ప్రభుత్వానికి సిగ్గు పడాలని విమర్శించారు.
"तुष्टिकरण के सरदार-बिहार के कुर्सी कुमार"
एकबार फिर चाचा-भतीजे की सरकार का हिंदू विरोधी चेहरा सामने आया। एक तरफ स्कूलों में मुस्लिम पर्व की छुट्टी बढ़ाई जा रही हैं,वहीं हिंदु त्योहारों में छुट्टियां खत्म की जा रही हैं।
लानत है वोटबैंक के लिए सनातन से घृणा करने वाली सरकार को। pic.twitter.com/3yX6WAeGnx
— Ashwini Kr. Choubey (@AshwiniKChoubey) November 27, 2023





