
217views
చైనాలో H9N2 ఇన్ఫెక్షన్ వ్యాప్తి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఆ దేశంలో ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ ఇన్ఫెక్షన్‌కి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు.
దీనిపై మరోసారి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గతంలో చైనాలోని వూహాన్ నగరంలో ఇలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని తాజా ఉదంతం గుర్తుకు తెచ్చింది.
ఈ నేపథ్యంలో భారత్‌లో దీని ప్రమాదం తక్కువే అని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. చైనాలో వ్యాప్తి చెందుతున్న ఏవియన్ ఇన్‌ఫ్లూఎంజా కేసులు, శ్వాసకోశ వ్యాధుల నుంచి భారత దేశానికి ప్రమాదం తక్కువగా ఉందని తెలిపింది. చైనా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.





