
ప్రపంచం శాంతి మార్గంలో దూసుకుపోతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ పరమ పూజ్యనీయ డా. మోహన్ భగవత్ జీ అన్నారు. ఇప్పుడు భారతదేశం మాత్రమే మార్గాన్ని చూపుతుందని భావిస్తున్నానన్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జయస్య ఆయత్నం ధర్మ: అనే థీమ్‌తో ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశం నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎదుర్కొంటున్న సవాళ్లు వాటి పరిష్కార మార్గాలు ప్రధాన ఎజెండాగా ఈ నెల 26వ తేదీ వరకు ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా డా. మోహన్ భగవత్ జీ పాల్గొని ప్రసంగించారు. 2000 సంవత్సరాలుగా ఆనందం, శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచం చాలా ప్రయోగాలు చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ భౌతికవాదాన్ని, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానాన్ని ఉపయోగించారని అలాగే వివిధ మతాలను సైతం ప్రయత్నించారని, ఈ క్రమంలో భౌతిక శ్రేయస్సు పొందినప్పటికీ ప్రజలు సంతోషంగా లేరన్నారు.
ప్రపంచంలోని 2000 సంవత్సరాల ప్రయత్నాలు కూడా సంతృప్తిని ఇవ్వలేకపోయాయని మోహన్ భగవత్ జీ స్పష్టం చేశారు. నేటి ప్రపంచం సరైన దారిలో లేదని, అల్లాడుతోందని, ప్రస్తుతం ప్రపంచం శాంతి పథంలో పయనించేందుకు ఆసక్తితో ఉందని భారత్ మాత్రమే మార్గాన్ని చూపగలదని భావిస్తున్నట్లు సర్ సంఘ్ చాలక్ జీ అభివర్ణించారు. అందరి ఆశలు భారత్ పైనే ఉన్నాయన్నారు. ముఖ్యంగా కోవిడ్ కాలం తర్వాత ప్రపంచం పునరాలోచన చేయడం ప్రారంభించిందన్నారు. వసుదైవిక కుటుంబం భావన ప్రపంచ దేశాలకు కలుగుతోందని, ఆ సంస్కృతిని కర్తవ్యముగా భారత సమాజం మొదటి నుంచి అవలంబిస్తోందన్నారు.
కొన్ని నెలల క్రితం వరల్డ్ ముస్లిం కౌన్సిల్ జనరల్ భారత్‌కు వచ్చారని, మనకు కావాలంటే ప్రపంచంలో సామరస్యాన్ని తీసుకురాగలమని, అందుకు భారత్ అవసరమని ఆయన తన ప్రసంగంలో చెప్పారని మోహన్ భగవత్ జీ గుర్తు చేశారు. కాబట్టి ప్రపంచదేశాలకు దారి చూపించడం భారత్ విధి అని ఈ కారణంగానే హిందూ సమాజం ఉనికిలోకి వచ్చిందన్నారు.
ఇదిలా ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎదుర్కొంటున్న అవకాశాలు మరియు సవాళ్లను మరియు వాటిని ధైర్యంగా ఎలా పరిష్కరించాలో చర్చించడానికి మరియు చర్చించడానికి ఈ సమావేశాలు స్థలాన్ని అందిస్తాయి. ఈ సమావేశాలు హిందువులకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలపై దృష్టి సారిస్తాయి మరియు హిందూ పునరుజ్జీవనం కోసం హిందూ నాయకులు, కార్యకర్తలు మరియు ఆలోచనాపరుల మధ్య సహకారానికి మార్గాలను అందిస్తాయి.





