News

భారత్ కు మరో దౌత్య విజయం – చరిత్రలో తొలిసారి 13 ఉగ్రవాద సంస్థలను నిషేదించిన పాక్.

781views

పాక్ ప్రేరిత ఉగ్రవాదంపై తన కఠిన వైఖరిని కొనసాగించడం ద్వారా భారత్ మరో దౌత్య విజయాన్ని సాధించింది. భారత్ దౌత్య పరంగా ఉచ్చు బిగించడంతో పాక్ కీలకమైన ఉగ్రవాద స్థావరాలను మూసివేసింది. హిజ్బుల్ ముజాహిద్దిన్, లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి సంస్థలతో సహా వాస్తవాధీన రేఖను ఆనుకుని వున్న 12 ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను, సంస్థల కార్యకలాపాలను పాక్ నిలిపివేసింది.

ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఏర్పరచుకున్న బలమైన దౌత్య సంబంధాల కారణంగా పుల్వామా ఉగ్రదాడి తర్వాత ప్రపంచ దేశాల నడుమ పాక్ ఏకాకిగా మారిన విషయం తెలిసిందే. మరో వారంలో ప్రపంచ వ్యాప్త ఉగ్రవాద వ్యతిరేక కార్య కలాపాల నిఘా సంస్థగా పేర్కొనదగిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సెస్ (FATF) ప్లీనరీ సమావేశం జరుగనున్న తరుణంలో ఉగ్రవాద నిరోధానికి పాక్ పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లుగా తమకు బలమైన సాక్ష్యాధారాలు చూపని కారణంగా పాక్ ను  గ్రే లిస్టులో వుంచడం పాక్ కు మరో అశనిపాతం. ఇప్పటికే దెబ్బతిన్న తమ ఆర్ధిక వ్యవస్థ మరింత దిగజారకుండా చూసుకోవడం తోపాటు, FATF తమ దేశాన్ని బ్లాక్ లిస్టులో పెట్టకుండా ఉండేలా చూసుకోవడం పాక్ తక్షణ కర్తవ్యం.

భారత్ తీసుకున్న కఠిన చర్యల కారణంగా పుల్వామా దాడికి తామే బాధ్యులమని ప్రకటించుకున్న జైషే మొహమ్మద్ నాయకత్వం కాశ్మీర్ ప్రాంతంలో దాదాపు తుడిచిపెట్టుకుపోగా, గత సంవత్సర కాలంలో  భద్రతా దళాలు చేసిన ఎదురుదాడులతో లష్కరే తోయిబా కూడా కనుమరుగైనట్లే.

భారత్ తన విశేష కృషితో ఫలాహ్ – ఏ – ఇన్సానియత్ తో సహా ఉగ్రవాదానికి సహకరించే  అనేక సంస్థలు, గ్రూపులు, వ్యక్తుల ఆర్ధిక మూలాలను దెబ్బతీయ గలిగింది.

26/11 WTO దాడుల తర్వాత కానీ, 2001 భారత పార్లమెంట్ పై దాడి తర్వాత కానీ పాక్  తమ దేశంలోని ఉగ్రవాద కార్యకలాపాలు, సంస్థలపై కేవలం నామమాత్రపు చర్యలు మాత్రమే తీసుకుని ప్రపంచాన్ని మభ్యపెట్టింది. అయితే ఇప్పుడు దానికి విరుద్దంగా FATF సభ్య దేశాలన్నీ పాక్ తీసుకుంటున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై బలమైన సాక్ష్యాధారాలు చూపాలని ఒత్తిడి తేవడంతో దాదాపు పాక్ చరిత్రలో మొదటిసారి ఉగ్రవాద సంస్థలకు చెందిన విద్యా సంస్థలు, మదర్సాలు, చివరికి ఆసుపత్రులతో సహా 800కు పైగా ఉగ్రవాద సంబంధిత సంస్థలను నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.