News

కాశీలో కోటిలింగాలకు పూజలు

163views

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేతమైన వారణాసిలో కోటికి పైగా మట్టితో తయారు చేసిన శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. లోక కల్యాణం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారణాసిలోని శివలాఘాట్‌లో విజయానందనాథ గురుసేవాసమితి ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యక్రమం.. ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనుంది. ‘‘కోటి శివలింగాలు తయారు చేయడానికి దేశంలోని 58 కేంద్రాల్లో పదివేల మంది అయిదు నెలలపాటు శ్రమించారు. ఇంత పెద్ద సంఖ్యలో శివలింగాలు తయారు చేసి పూజలు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని కోటి శివలింగాల పూజ కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఐదువేల మంది మహిళలతో హైదరాబాద్‌కు చెందిన మహాలక్ష్మి శివలింగాలను తయారు చేయించారన్నారు. పూజల అనంతరం శివలింగాలను భక్తులకు పంపిణీ చేయనున్నామని వెల్లడించారు.