News

తెలుగు రాష్ట్రాల్లో కార్తికశోభ : నదుల్లో పుణ్యస్నానాలు, శివాలయాల్లో ప్రత్యేకపూజలు

353views

కార్తికశోభతో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, శివాలయాలు కిటకిటలాడాయి. వేకువజాము నుంచే గోదావరి, కృష్ణా నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాజమహేంద్రవరం, విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, భద్రాచలం వేములవాడ తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. నదుల్లో పుణ్యస్నానాల అనంతరం మహిళలు దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు.

రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌, కోటిలింగాల ఘాట్‌కు వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.