News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

336views

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ధ‌నుర్‌ ల‌గ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌య్యాయి. వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ఇఓ ఎ.వి.ధర్మారెడ్డిలు పాల్గొన్నారు.ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చిన్న శేష వాహన సేవ జరుగనుంది. బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌తిరోజూ ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయి. తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలను టిటిడి నిర్వహించనుంది.

మరోవైపు తిరుమలలో ఈ నెల 12వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ దర్శనం మినహా బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టిటిడి తెలిపింది. దీపావళి ఆస్థానం ముందు రోజైన 11వ తేదీన బ్రేక్ దర్శనానికి సిఫారసు లెటర్లు స్వీకరించబడవని తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టిటిడి కోరుతోంది.