
కొన్నాళ్లుగా ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గాలి నాణ్యత సూచీ అత్యంత తీవ్రమైన స్థాయిని సూచిస్తోంది. స్కూళ్లకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించింది కేజ్రివాల్ సర్కార్.
వాహనాల సరి-బేసి పద్ధతి కూడా అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తూ కొన్ని ఛాయాచిత్రాలు విడుదల చేసింది నాసా. పంజాబ్ నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించిన ఒక దట్టమైన పొర స్పష్టంగా కనిపిస్తోందిక్కడ.
ఉత్తరాదిలో పంట వ్యర్థాల్ని తగలబెట్టడం కారణంగా ఏర్పడ్డ కాలుష్యానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఇటీవలి కాలంలో పంట దగ్ధం 740 శాతం పెరిగిందని, అక్టోబర్ 29న ఒక్కరోజే వెయ్యికి పైగా ఇటువంటి కేసులు నమోదయ్యాయని పేర్కొంది యూఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా. దీపావళి సమీపిస్తుండడంతో, బాణాసంచా పేలుళ్ల వల్ల గాలి నాణ్యత మరీ దారుణంగా పడిపోవచ్చని హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతాంగాన్ని అప్రమత్తం చేయకపోతే.. ఢిల్లీ నివాసయోగ్యతను కోల్పోవచ్చని హెచ్చరిస్తోంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. మరోవైపు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరడంతో ఢిల్లీలోని విద్యాసంస్థలకు సెలవుల్ని పొడిగించింది. నవంబర్ 09 నుంచి 18 దాకా సెలవులు ఉంటాయని ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం కల్లోలం సృష్టిస్తోంది. గాలి చాలా వరకు విషపూరితంగా తయారైంది. అయితే.. ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాదు.. దాని పరిసర రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోనూ విషపూరిత పొగలు అలుముకున్నాయి. అవి ఎంతలా అంటే.. విషపూరిత పొగ బంగాళాఖాతం వరకు వ్యాపించిందంటూ నాసా ఆసక్తికర చిత్రాలను విడుదల చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఆకాశం నిండా పొగలు అలుముకున్నాయి. దానికి సంబంధించి.. ప్రస్తుతం చూస్తున్న ఈ చిత్రాలే నాసా తాజాగా విడుదల చేసింది. ఇక ఈ నెల ఫస్ట్ న రిలీజ్ చేసిన ఇమేజ్‌లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇందులో తాజా చిత్రానికంటే కంటే తక్కువ విషపూరితమైన పొగ కనిపిస్తుంది. పరిస్థితి అలాగే ఉన్నప్పటికీ ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గత కొన్ని రోజులుగా తీవ్రమైన కేటగిరీలో ఉంది. నాసా వరల్డ్‌వ్యూ నుంచి వచ్చిన విజువల్స్ భారతదేశంలోని మైదానాలను పొగమంచు దట్టమైన దుప్పటిని కప్పివేసినట్లు చూపించాయి.





