
464views
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలం ఊట్లవారి పల్లిలో కొలువుదీరిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 54 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్వేశ్వర స్వామి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్బంగా మహా సంప్రోక్షణలతో జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. హరోం హర నామస్మరణలతో ఊట్లవారి పల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. స్వర్ణ కాంతులీనే ఇటువంటి 54 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం రాష్ట్రంలో రెండవదని నిర్వాహకులు తెలిపారు. ఆగమోక్తంగా జరిగిన విగ్రహావిష్కరణ, కుంభాభిషేకం మహోత్సవం తదితర వైదిక కార్యక్రమాలలో విశేష సంఖ్యలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.





