News

దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు

282views

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో ఎనిమిదో రోజు దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి.. దుర్గగా వెలుగొందింది. దుర్గమాసురుడిని వధించిన తర్వాత కీలాద్రిపై స్వయంగా అమ్మవారు ఆవిర్భవించింది. దుర్గే దుర్గతి నాశని అనే వాక్యం భక్తులకు శుభాలను కలగజేస్తుంది. శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుంది. దివ్యరూపిణి అయిన దుర్గమ్మ దర్శనం సకల శ్రేయోదాయకమని భక్తుల నమ్మకం.