
221views
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి విశేష సమర్పణ చేసిన అనంతరం స్వర్ణరథంలో ఊరేగించారు. గరుడ సేవ తర్వాత రథోత్సవానికే అంతటి ప్రాముఖ్యత ఉంది. రథంపై అధిష్ఠించిన స్వామికి అడుగడుగునా భక్తులు నీరాజనాలు పలికారు.
ఆదివారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య వాహన సేవల్లో చివరగా అశ్వ వాహన సేవ జరగనుంది. సోమవారం ఉదయం 6 నుంచి 9గంటల మధ్య ఉత్సవాల ముగింపుగా చక్ర స్నానం క్రతువును శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించనున్నారు.





