
రీశైలంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఉత్సవాల సందర్బంగా శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఐదవరోజు గురువారం భ్రమరాంబాదేవి స్కందమాతగా భక్తులను అనుగ్రహించారు. స్కందమాతగా చతుర్బుజాలు కలిగి పద్మం, కమలం, అభయహస్తం, ఒడిలో బాల షణ్ముఖుడైన కుమారస్వామి (స్కందుడు) ని ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. శేషవాహనంపై శ్రీశైల మల్లన్నతో కలిసి భక్తులను కరుణించింది.
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకారమండపంలో శేషవాహనంపై భ్రమరాంబ సహితంగా అధిష్టించిన మల్లికార్జున స్వామి వారికి ప్రధాన అర్చకులు, వేదపండితులు వాహనసేవ వైభవంగా జరిపించారు. అలంకీకృతమైన స్కందమాత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను భక్తులు కనువిందుగా దర్శించుకున్నారు.
శుక్రవారం కాత్యాయని అలంకారంలో దర్శనం
శరన్నవరాత్రుల్లో ఆరవరోజు శుక్రవారం భ్రమరాంబాదేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమివ్వనున్నారు. మల్లికార్జున స్వామివారికి హంసవాహసేవ నిర్వహించనున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.





