News

ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు చేరుకున్న అయిదో విమానం

240views

ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆపరేషన్ అజయ్( పేరుతో చేపట్టిన ఈ తరలింపు ప్రక్రియలో భాగంగా ఇజ్రాయెల్ నుంచి భారత్ కు అయిదో విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఇందులో మొత్తం 286 మంది ప్రయాణికులున్నారు. 18 మంది నేపాలియన్లు సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే భారత్ వచ్చిన 4 విమానాల్లో వెయ్యికి పైగా ఇండియన్స్ తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్ లో 18 వేలకు పైగా భారతీయులు నివసిస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ అజయ్ లో భాగంగా వచ్చిన ప్రయాణికులకు కేంద్ర సహాయ మంత్రి మురుగన్ స్వాగతం పలికారు. వీరిలో కేరళకు చెందిన వారు 22 మంది ఉన్నారు. అయితే స్పైస్‌జెట్ విమానం A340 టెల్ అవీవ్‌లో ల్యాండ్ అయిన తర్వాత సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. దీంతో విమానాన్ని జోర్డాన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి భారత్ కు సేఫ్ గా తిరిగి వచ్చింది.