
218views
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి గరుడోత్సవాన్ని 19వ తేదీ సాయంత్రం 6.30 గంటలకే ప్రారంభించాలని నిర్ణయించినట్లు టీటీడీ పేర్కొంది . బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.





