
307views
ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. భౌతిక శాస్త్రం లో ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ ముగ్గుర్ని వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌కు ఈ ఏడాది నోబెల్ ప్రకటించారు.
అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్‌ను అధ్యయనం చేసేందుకు.. కాంతి తరంగాల ఆటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకు గానూ వీరికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. వీరి పరిశోధనలతో అణువులు, పరామణువుల్లోని ఎలక్ట్రాన్స్ ను అధ్యయనం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు అందాయని పేర్కొంది.





