
223views
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తొలి సమావేశంలోనే ప్రవేశ పెట్టిన గోవింద కోటి లిఖిత కార్యక్రమం ఆచరణలోకి తేవడానికి బుధవారం తొలి అడుగుపడింది.
తిరుపతి నగరంలోని వినాయక సాగర్ లో ఏర్పాటు చేసిన గోవింద కోటి వినాయకుడి సాక్షిగా శాసన సభ్యులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి భక్తులకు గోవింద కోటి పుస్తకాలు పంపిణీ చేశారు. విఘ్నాలను హరించే వినాయకుడే గోవింద కోటి రాస్తున్నట్లుగా తయారు చేసిన విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంది. విగ్రహం ఏర్పాటు చేసిన మండపం నలువైపులా గోవింద కోటి నామం రాయడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.





