News

రేపు ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల శంకరాచార్యుల విగ్రహావిష్కరణ

MP Chief Minister Invites Intersex Activist To Inaugural Ceremony Of 108 Adi Shankara Statue At Omkareshwar - 1
231views

రేపు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. శంకరాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి 5వేల మందికి పైగా సాధువులు పాల్గొంటున్నారు.రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కేరళ సంప్రదాయాల ప్రకారం సాధువులకు స్వాగతం పలకనున్నారు. అనంతం సాధువులతో కలిసి యజ్ఞం చేయనున్నారు.

శివ స్వరూపంగా భావించే ఆది శంకరాచార్యులు ఓంకారేశ్వర్‌లో నాలుగేళ్లపాటూ ఉన్నారు. కేరళలో జన్మించిన శంకరాచార్య తన బాల్యంలో సన్యాసం తీసుకున్న తర్వాత, ఓంకారేశ్వర్‌కు చేరుకున్నారు. అక్కడ తన గురువైన గోవింద్ భగవత్‌పాద్‌ను కలుసుకున్నారని చెబుతారు. మత విశ్వాసాల ప్రకారం, శంకరాచార్య అద్వైత వేదాంత తత్వాన్ని ప్రజలకు వ్యాప్తి చేయడానికి 12 సంవత్సరాల వయస్సులో ఓంకారేశ్వర్‌ను విడిచి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లారని చెబుతారు.

ఇండోర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓంకారేశ్వర్‌ లో నర్మదా నది ఒడ్డున ఉన్న మాంధాత పర్వతంపై ‘స్టాట్యూ ఆఫ్ వన్‌నెస్’ ఆవిష్కరిస్తారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ విగ్రహా నిర్మాణం కోసం 2,141 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌ను కేటాయించింది. రాష్ట్రం యొక్క సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వాన్ని కాపాడటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ఓంకారేశ్వర్‌లో ‘అద్వైత లోక్‌’ పేరుతో మ్యూజియం, ఆచార్య శంకర్‌ ఇంటర్నేషనల్‌ అద్వైత వేదాంత ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుతో పాటు 36 హెక్టార్లలో ‘అద్వైత వనాన్ని’ అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటనలో తెలిపారు.