
738views
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ‘హిందూ ఉగ్రవాది’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆయనపై ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కోర్టులో విష్ణు గుప్తా అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సే స్వతంత్ర భారతావనిలో తొలి హిందూ ఉగ్రవాది అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, అందుకు కమల్‌పై కఠిన చర్య తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కమల్‌పై ఐపీసీ సెక్షన్ 153-ఏ, సెక్షన్ 295-ఏ పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌దారు కోరారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది. మరోవైపు ఇదే అంశంపై బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ కూడా ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టును ఆశ్రయించారు.





