
12. 5. 2019 ఆదివారం స్థానిక భద్రావతి భావనా రుషి ఆలయ కళ్యాణ మండపంలో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో లో భజన పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో 16 బృందాల చిన్నారులు పోటీలో పాల్గొనడం జరిగింది కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల 30 నిమిషాలకు శ్రీ రంగనాథస్వామి ఆశీః ప్రసంగంతో ప్రారంభించారు.

స్వామి వారు మాట్లాడుతూ భజన చేయడం వల్ల ఆధ్యాత్మిక భావన, మానసిక ఆరోగ్యం, చురుకుదనం, పెద్దల పట్ల భగవంతుని పట్ల గౌరవ భావన కలుగుతుందని ప్రతి మనిషిలో సాత్విక భావన జాగృతమై వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి భజన పోటీలు నిర్వహించడం హర్షించదగ్గ విషయం అన్నారు.

ఈ కార్యక్రమంలో ధర్మ జాగరణ సమితి జిల్లా ప్రముఖ్ రాంప్రసాద్, నగర ప్రముఖ్ చింతల పల్లె వాసు, డాక్టర్ ఉదయ శంకర్, శ్రీ మనోహర్, దేవాలయ అధ్యక్షులు శ్రీ గంజి వెంకటేశ్వర్లు, కమిటి సభ్యులు పాల్గొన్నారు. పోటీలో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు.

మొదటి బహుమతి ఆంజనేయ భజన బృందం జగజ్జనని నగర్, రెండో బహుమతి మారమ్మ భజన బృందం బోయరేవుల, మూడో బహుమతి దుర్గాప్రసాద్ సంఘమిత్ర విద్యార్థుల బృందం గెలుచుకున్నారు.

ఇలాంటి కార్యక్రమాలు మా దేవాలయంలో నిర్వహించడం చాలా సంతోషం గా ఉంది అని ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ గంజి వెంకటేశ్వర్లు మరియు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమనికి సహకరించిన అందరికి ధర్మ జాగరణ కమిటీ సభ్యలందరి తరుపున నరసింహులు గారు ధన్యవాదాలు తెలియజేశారు.





