News

ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్‌

173views

యూపీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్‌ను పోలీసులు హతమార్చారు. అతని వద్ద నుంచి విదేశీ తయారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఝాన్సీ వద్ద ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మరణించారు. అసద్ అహ్మాద్ , గులామ్‌లను పోలీసులు హతమార్చారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఓ మర్డర్ కేసులో ఇద్దరూ మోస్ట్ వాంటెడ్ నిందితులు.

ఉమేశ్ పాల్ మర్డర్ కేసులో అసద్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో అసద్‌పై 5 లక్షల రివార్డు కూడా ఉంది. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు ఝాన్సీలో అతన్ని ఎన్‌కౌంటర్ చేశారు.సీటీఎఫ్ డిప్యూటీ ఎస్పీ నవేందు, డిప్యూటీ ఎస్పీ విమల్ నాయకత్వంలో ఆ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉమేశ్ మర్డర్ కేసులో అతిక్ అహ్మాద్‌ను నేడు ప్రయాగ్‌రాజ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.