News

యోగీ సర్కార్ కు అరుదైన ప్రశంస-కోవిడ్ ఎదుర్కొన్న తీరుపై యునిసెఫ్ ఫిదా

205views

దేశం మొత్తాన్ని రెండేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి కుదిపేస్తున్న సమయంలో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ స్పందించిన తీరు అప్పట్లో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు యునిసెఫ్ కూడా అదే విషయాన్ని చెబుతూ ప్రసంశలు కురిపించింది. యోగీ ఆదిత్యనాథ్ తో భేటీ అయిన యునిసెఫ్ ప్రతినిధి సింథియా మెక్ కాఫ్రే యోగీ సర్కార్ అప్పట్లో కోవిడ్ ను ఎదుర్కొన్న తీరును ప్రశంసించారు.

ఇప్పటికే సామాజిక ఆరోగ్యం, మహిళల సాధికారత, కోవిడ్ నిర్వహణ విషయంలో యోగీ సర్కార్ ప్రదర్శనను యునిసెఫ్ ప్రతినిధి సింథియా మెక్ కాఫ్రే మెచ్చుకున్నారు. అంతే కాదు యూపీ ప్రభుత్వానికి కావాల్సిన సాంకేతిక, అకడమిక్ సేవల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. యోగీ ఆరేళ్ల పాలనలో యూపీలో గర్భవతులు, శిశువుల మరణాల రేటు భారీగా తగ్గిందని ఆమె పేర్కొన్నారు. అలాగే మారుమూల గ్రామాల్లో సైతం వైద్య సేవలు అందుతున్నట్లు ఆమె వెల్లడించారు.