News

వైభవంగా రఘునాథుడి కల్యాణం

196views

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ పరిధిలోని గొల్లపల్లి రఘునాథస్వామి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. అనంతరం అశ్వ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. తొలుత మంగళ వాయిద్యాలతో తీర్థపు బిందె, నిత్యార్చన, నిత్యహోమం, శ్రీరామాంజనేయ మూలమంత్ర హవనం, బలిహరణ, మంగళ శాసనం, తీర్థప్రసాద గోష్ఠి, నిత్యార్చన, నిత్యహోమం, రాత్రి 10 గంటల నుంచి గజవాహనంపై ఎదుర్కోలు ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం స్వామి కల్యాణోత్సవాన్ని వేదమంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా నిర్వహించారు. సోమవారం రాత్రి ఏడు గంటలకు డోలా మండపం వద్ద ఊంజల సేవ, హను మంత వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేం దుకు నూజివీడు, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.