
181views
గత ఫిబ్రవరిలో నిర్వహించిన తనిఖీల్లో 59 రకాల మందులు నాసిరకమైనవిగా గుర్తించినట్లు కేంద్ర, రాష్ట్ర నాణ్యత నియంత్రణ బోర్డులు సంయుక్తంగా ప్రకటించాయి. మందుల తయారీ సంస్థలు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి 1,251 రకాల మందులను పరీక్షించామని, వాటిల్లో 59 రకాల మందులు నాసిరకమైనవిగా గుర్తించామని అధికారులు తెలిపారు. వాటిల్లో ఎక్కువగా జ్వరం, జలుబు, జీర్ణ సమస్యల మందులు, కాల్షియం, ఐరన్ మాత్రలున్నాయని, ఇవి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాల్లో తయారయ్యాయన్నారు. నాసిరకం మందుల వివరాలను ప్రజలు తెలుసుకునేలా బోర్డు వెబ్‌సైట్ Ed-s-co.-go-v.in లో ఆప్‌లోడ్ చేశామని పేర్కొన్నారు.





