News

Tirupathi: నేడు శ్రీవారి అంగప్రదక్షణ టోకెన్ల విడుదల

72views

Tirupathi : నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ టోకెన్లను విడుదల చేయనుంది. గురువారం స్వామివారిని 58,965 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.5 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 25,113 మంది తలనీలాలు సమర్పించారు.