News

ఇకపై చైనా బొమ్మలకు చెక్.. దేశవాళీ బొమ్మల ఉత్పత్తికి కేంద్రం కసరత్తు

276views

స్మార్ట్ ఫోన్లు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, బాణాసంచా, దీపాలు ఇలా అనేక రకాల చైనా వస్తువులు భారత మార్కెట్ లో భారీగా అమ్ముడవుతున్నాయి. అయితే చౌకైన చైనీస్ బొమ్మలు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి.
దీంతో భారత ప్రభుత్వం చైనా బొమ్మలు దిగుమతి, నాణ్యతకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసింది.
ఈ నేపథ్యంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరో నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. చౌకైన చైనీస్ బొమ్మలను (ఇండియాలో చైనీస్ బొమ్మలు) భారత మార్కెట్ లో వినియోగం తగ్గించే విధంగా చర్యలు తీసుకోనుంది. ఓ వైపు చైనా బొమ్మల నాణ్యతపై కఠిన మైన నిబంధనలు అమలు చేస్తూ.. మరోవైపు దేశవాళీ బొమ్మల ఉత్పత్తిని పెంచే విధంగా ప్రణాళికలను రూపొందించింది. దేశవాళీ బొమ్మల ఉత్పత్తిని పెంచేందుకు రూ.3500 కోట్లతో ఓ కొత్త పథకాన్ని రూపొందించింది.
దేశంలో బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం రూ. 3,500 కోట్లతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని తీసుకువస్తోంది. ఇందుకోసం ఇప్పటికే క్యాబినెట్ నోట్ కూడా సిద్ధం చేసింది.

అన్ని రకాల బొమ్మలు తయారు చేసే విధంగా..

చైనీస్ బొమ్మలు చౌకగా ఉండటం వల్ల నాణ్యత తక్కువగా ఉంది. అందువల్ల.. దేశంలో వాటి దిగుమతిని తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నాణ్యతా ప్రమాణాలను తీసుకువచ్చింది. అదే సమయంలో.. PLI పథకం అమలుతో దేశంలో బొమ్మల ఉత్పత్తి పెరుగుతుంది. నాణ్యమైన బొమ్మలు తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.