News

శ్రీలంకలో రెండు ఇస్లామిక్ మతవాద సంస్థలపై నిషేదం.

923views

ష్టర్ పర్వదినం సందర్భంగా శ్రీలంకలోని పలు ప్రాంతాలలో జరిగిన పేలుళ్ళ దృష్ట్యా శ్రీలంకలో రెండు ఇస్లామిక్ మతవాద సంస్థలపై నిషేదం విధించారు. నేషనల్ తౌహీద్ జమాత్ (NTJ), జమాతే మిల్లతు ఇబ్రహీం సీ ఇలాని(JMI) అనే రెండు ఇస్లామిక్ మతవాద సంస్థలపై శ్రీలంక ప్రభుత్వం నిషేదం విధించింది.

అత్యవసర చర్యలలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైలీ మిర్రర్ పత్రిక వెల్లడించింది. నిషేదంలో భాగంగా ఆ సంస్థలకు చెందిన స్థిర, చరాస్తులన్నిటిని సీజ్ చేస్తున్నట్లుగా అధ్యక్ష భవనంలోని మీడియా విభాగం వెల్లడించింది.

దశాబ్ద కాలంగా జరిగిన అనేక దాడులలో NTJ సభ్యుల ప్రమేయం వున్నదని శ్రీలంక పోలీసు వర్గాలు నిర్ధారించాయి. సౌదీ అరేబియాలో ఆచరణలో వున్న కఠిన ఇస్లామిక్ పంధా వహాబిజం యొక్క ప్రభావం NTJ పై అధికంగా వున్నదని పోలీసుల విచారణలో తేలింది.

NTJ కి చెందిన ప్రముఖ నేత, పేలుళ్ళ సూత్రధారిగా భావిస్తున్న జహ్రాన్ హషిం శ్రీలంకలోని షంగ్రిలా హోటల్లో తనకు తానుగా పేల్చుకుని మృతి చెందాడు. NTJ కి ఐఎస్ఐఎస్ తో కూడా దగ్గరి సంబంధాలున్నట్లుగా తెలుస్తోంది.