
ఉదయపూర్ లో జరిగిన ప్రభాత్ గ్రామ వికాస్ మిలన్ ముగింపు సభలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ మాట్లాడారు. గ్రామాభివృద్ధి సమాజ కార్యాచరణ అని అన్నారు. ప్రతి క్షణం సమాజమంతా మనదేనని నిత్యం భావించాలని, అటువంటి ప్రవర్తన ద్వారా సమాజ ప్రవర్తనలో మార్పు రావాలని, స్థిరమైన వ్యవస్థీకృత సమాజాన్ని రూపొందించాలని అన్నారు.
సమాజ ఆధారిత అభివృద్ధి మన దేశ స్వభావం అని. గతంలో కూడా భారతదేశం అన్ని రకాలుగా అభివృద్ధిని చేస్తూనే అగ్రగామి దేశంగా ఉందని, పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచేందుకు కృషిచేశామని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచం మొత్తంలో ఆర్థికరంగంలో మనమే ప్రథమ స్థానంలో ఉన్నామని, ప్రభుత్వం నుంచి సాయం ఆశించకుండా సమాజాన్ని మేల్కొలిపి స్వావలంబన సాధించాలన్నారు. గ్రామాభివృద్ధి మనతోనే జరగాలన్నారు. మనతో కలిసి పనిచేసే వారిని గుర్తించి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. అభివృద్ధికి సామూహిక ఆలోచన అవసరమన్నారు. అటువంటి అభివృద్ధి కార్యకలాపాల ఫలితం క్రమంగా వస్తుందన్నారు. ఓపికగా దృష్టితో పనిచేయాలని.. అప్పుడే మాత్రమే సమర్థత అభివృద్ధి చెందుతుందని సర్‌సంఘ్‌చాలక్ భాగవత్‌జీ స్పష్టం చేశారు.





