News

చెంగాళమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు

231views

నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట చెంగాళమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా గురువారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి యాగశాల మండపంలో పూజలు చేశారు. ఆలయ ఆవరణతోపాటు సూళ్లూరుపేట పట్టణ పురవీధుల్లో అరటిమాన్లు, మామిడాకు తోరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. రెండో రోజు స్వర్ణ విమాన గోపురంపై ప్రతిష్ఠించే శిఖర కలశాలకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం యాగశాల మండపంలో గణపతి పూజతో ప్రారంభించి కైలాస మండపారాధన, విశేష ద్రవ్య స్నపన, యోగినీ మండపారాధన, బలిహోమంతోపాటు ఆవరణ హోమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.