News

ఫణి తుఫాను అలర్ట్.. తీవ్ర వాయుగుండంగా..!

1.1kviews

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయం తీవ్ర వాయుగుండంగా మారింది. శనివారం సాయంత్రానికి అది మరింత తీవ్రం కానున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 29వ తేదీ నాటికి ఇది మరింత బలపడి 30వ తేదీ నాటికల్లా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఒకవేళ దిశను కూడా మార్చుకోవచ్చని అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి ఇది ప్రయాణించే అవకాశాలు ఉన్నప్పటికీ ఏపీ తీరం తాకే అవకాశాలు లేవని చెప్పారు.

తుపాను నేపథ్యంలో జాలర్లు వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు ఆదివారం లోగా తీరానికి చేరుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మచిలీపట్టణానికి 1690 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని ట్రికోమలీకి 1060 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 1410 కిలోమీట్ల దూరంలో  వాయుగుండం కేంద్రీకృతమై ఉందన్న అధికారులు ఈ ఉదయం అది తీవ్ర వాయుగుండంగా మారి, 5:30 గంటల ప్రాంతంలో తుపానుగా మారినట్టు తెలిపారు. 29న అది తీవ్ర తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో 30న దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.