
25/4/2019 గురువారం విశాఖపట్నం జిల్లా పాడేరులో సేవా భారతి ఆరోగ్య మిత్ర కార్యకర్తల వర్గ జరిగింది. ఈ వర్గకు నాలుగు మండలాల నుండి 110 మంది ఆరోగ్య మిత్ర కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కి రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఆది శంకర రావు, విశాఖ విభాగ్ ప్రచారక్ శ్రీ నవీన్ ప్రాంత సహ సేవా ప్రముఖ్ శ్రీ కొండా రెడ్డి, ప్రాంత సేవాభారతి సంఘటన కార్యదర్శి శ్రీ పృధ్వీ రాజు విశ్వాసి కళ్యాణాశ్రం సంఘటనా మంత్రి శ్రీ కొండ బాబులు పాల్గొని మార్గదర్శనం చేశారు.

ఈ వర్గలో తీసుకున్న నిర్ణయాలు:
1) జూన్ మాసంలో ఆరోగ్య మిత్ర కార్యకర్తలకు మూడు రోజులపాటు సాంకేతిక శాస్త్ర ప్రశిక్షణ విశాఖపట్నంలో జరపాల్సిందిగా నిర్ణయం చేశారు.
2)చదువుకు సంబంధించిన అభ్యాసికలు కొన్ని గ్రామాల్లో ప్రారంభించాలని, వారికి కూడా జూన్ మాసంలో ప్రశిక్షణ ఆరోగ్యమిత్ర కార్యకర్తలతోపాటు విడిగా జరపాలని నిర్ణయించారు.
3) వనవాసీలకు భజన మరియు సంస్కారానికి సంబంధించి వారి పరంపరగా వస్తున్న కళలను ప్రోత్సహించే దిశగా వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
4) గ్రామాల్లో కార్యకర్తలకు స్వావలంబన దిశగా ప్రశిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు .

ఆరోగ్యమిత్ర కార్యకర్తల ప్రశిక్షణ అనంతరం పాడేరులోని మఠం లో జరుగుతున్నటువంటి టెలీ మెడిసిన్ సెంటర్ ను ప్రాంత జట్టు సభ్యులు సందర్శించారు. టెలీ మెడిసిన్ సెంటర్ ను ఇప్పటివరకు ధనుష్ ఇన్ఫోటెక్ సౌజన్యంతో వనవాసి కళ్యాణాశ్రమం నిర్వహించుచున్నది. కానీ ఈ మధ్యకాలంలో సరిగా జరగని కారణంగా వారు సేవా భారతిని నిర్వహణ చేయవలసిందిగా కోరినప్పుడు కార్యకర్తలు సందర్శించి పూర్వాపరాలను ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు టెలీ మెడిసిన్ సెంటర్ ను సందర్శించారు.






