News

ముంబయి దాడులను మరోసారి గుర్తు చేసిన పాక్‌ కవి జావెద్‌ అక్తర్‌.. సంచలన విషయాలు వెల్లడి!

57views

ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావెద్ అక్తర్ (hned Akhtar) పాకిస్థానన్ను ఆ దేశంలోనే విమర్శించారు. 26/11 ముంబయి ఉగ్రపేలుళ్ల ఘటనను గుర్తుచేసుకున్న ఆయన. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా లాహోర్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ స్మారకార్ధం ఇటీవల లాహోర్లో ఫైజ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జావెద్ అక్తర్‌కు ఆహ్వానం లభించడంతో ఆయన ఈ ఫెస్టివల్లో పాల్గొన్నారు. అక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ… భారత్- పాక్ సంబంధాలు, ముంబయి ఉగ్రదాడులు (Teme land) ఘటనను ప్రస్తావించారు. ‘ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. పైగా ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. వాటిని తగ్గించాల్సిన అవసరముంది. మేం ముంబయి (Mumbai)కి చెందిన వాళ్లం. మా నగరంలో ఉగ్రవాదులు ఎంతటి బీభత్సాన్ని సృష్టించారో చూశాం. వారు(ముష్కరులు) నార్వే లేదా ఈజిప్టు నుంచి వచ్చిన వారు కాదు. వాళ్లు ఇంకా మీ దేశంలోనే(పాక్‌లోనే) స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా. అలాంటప్పుడు భారత్ దాని గురించి ఫిర్యాదులు చేసినప్పుడు మీరు దాన్ని ప్రతికూలంగా తీసుకోవాల్సిన అవసరం లేదు” అని అక్తర్ (Javed Akhtar) వ్యాఖ్యానించారు.

ఇక భారత ఆర్టిస్టులను పాక్ లో గౌరవించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. “నుశ్రత్ ఫతే అలీ ఖాన్, మెహదీ హసన్ లాంటి పాక్ కళాకారుల గౌరవార్ధం మేం పెద్ద కార్యక్రమాలు చేపడుతున్నాం. కానీ లతా మంగేష్కర్ కోసం పాక్ ఎప్పుడైనా ఫంక్షన్ ఏర్పాటు చేసిందా?” అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. 2008 నవంబరు 28న పాక్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థకు చెందిన 10 మంది ముష్కరులు ముంబయిలోకి చొరబడి నరమేదం సృష్టించిన విషయం తెలిసిందే ఈ ఘటనలో 168 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడుల్లో 9 మంది ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చారు. మరో ఉగ్రవాది ఆల్ సిటీ ప్రాణాలతో పట్టుకోగా.. నాలుగేళ్ల తర్వాత 2012లో అతడిని ఉరితీశారు.