News

శివరాత్రికి 315 ప్రత్యేక బస్సులు

210views

మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని శ్రీశైలం, కోటప్పకొండ, బైరవకోన, రామతీర్థం పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ఆధ్వర్యంలో 315 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా రీజియన్‌ మేనేజరు బి.సుధాకర్‌బాబు వెల్లడించారు. ఈ నెల 18న ఒంగోలు, పొదిలి, మార్కాపురం, కనిగిరి నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయని చెప్పారు. ఒంగోలు నుంచి కోటప్పకొండకు 45, శ్రీశైల పుణ్యక్షేత్రానికి 120 (ఒంగోలు 15, పొదిలి నుంచి 25, మార్కాపురం నుంచి 80) నడుపుతున్నట్లు తెలిపారు. కనిగిరి నుంచి భైరవకోనకు మరో 20, పొదిలి నుంచి రామతీర్థంకు 10 సర్వీసులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సాధారణ చార్జీలతోనే ఈ ప్రత్యేక సర్వీసులు నడుస్తాయని వెల్లడించారు. శ్రీశైలం వెళ్లే ప్రతి సర్వీసుకు ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం కూడా ఉంటుందన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు స్వామి దర్శనం టిక్కెట్లు రిజర్వేషన్‌తోపాటు పొందే సదుపాయం కల్పించామన్నారు. శీఘ్ర దర్శనం రూ.220, అతి శీఘ్ర దర్శనం రూ.520 (రిజర్వేషన్‌ చార్జీ అదనం)తో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని తెలిపారు.