
యానాంలోని గోపాల్‌నగర్ రామరాజు గార్డెన్స్‌లో నూతనంగా నిర్మించిన ఆలయంలో ధనలక్ష్మీ కల్యాణలక్ష్మి అమ్మవారి విగ్రహప్రతిష్ఠ, ఆలయ శిఖర మహోత్సవంలో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని యానాం పురవీధుల్లో ఊరేగించారు. తొలుత ఆలయ ప్రాంగణంలో ఆగమశాస్త్ర భాస్కర సుదర్శనం వెంకట జనార్ధనాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రతినిధులు చింతా వెంకటగణేష్, సీత, చింతా సాంబమూర్తి(శివ), నాగరత్నకుమారి దంపతులతో ఆలయంలో విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, నవకలశారాధన, చతుర్ధశ కలశారాధన, అగ్నిప్రతిష్ఠాపన, పంచగవ్యాధివాసం, క్షీరాధివాసం, జాలాధివాసం,అధివాసప్రధాన హోమం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శక్తివేషధారణలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. గురువారం 9.06 గంటలకు ప్రతిష్ఠలు, గోదృష్టి, నిర్వహిస్తారు. పూజల్లో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ప్రముఖులు పాల్గొన్నారు.





