News

250 విమానాలను కొనేందుకు ఎయిరిండియా ఒప్పందం

234views

యూరప్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి కొత్తగా 250 విమానాలను కొనేందుకు ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిరిండియాను గత కొంత కాలం క్రితమే టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. చిన్న, పెద్దతోపాటు అన్ని రకాల మార్గాలలో తాము ప్రయాణించగలిగేలా విమానాలను సమకూర్చుకోవాలని అనుకుంటున్నట్టు ఎయిరిండియా తెలిపింది. ఎయిర్‌బస్ ప్రత్యర్థి కంపెనీ బోయింగ్ నుంచి కూడా 220 విమానాలను కొనుగోలు చేయాలని ఎయిరిండియా చూస్తోంది. విమానయాన ఇండస్ట్రీ చరిత్రలో వాణిజ్యపరమైన విమానాల కొనుగోలుకు సంబంధించిన అతిపెద్ద డీల్ ఇదే. ప్రపంచంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఎదగాలని ఎయిరిండియా భావిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో వర్చ్యువల్‌గా సమావేశమైన సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యువల్ మాక్రోన్ ఈ డీల్‌ను ప్రకటించారు. బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ కూడా ఈ డీల్‌ను స్వాగతించారు. ఎయిర్‌బస్ తన విమానాల రెక్కలను యూకేలోనే డిజైన్ చేసి తయారు చేస్తుంది.