News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

103views

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం శ్రీవారి సర్వదర్శనానికి 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 71434 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 24,212 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.