
272views
ఆఫ్ఘానిస్థాన్‌లోని భారత్, ఇరాన్, చైనా రాయబార కార్యాలయాలను పేల్చివేస్తామని ఐఎస్‌ఐఎల్-కె(ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవన్ట్ ఖొరాసన్) ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. తాలిబాన్లే తమ ప్రథమ శత్రువులని ఆ సంస్థ ప్రకటించింది. దక్షిణాసియా, మధ్య ఆసియా దేశాలతో తాలిబాన్ల సంబంధాలను దెబ్బతీసేందుకు ఐఎ్‌సఐఎల్-కె ఈ హెచ్చరిక చేసిందని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. దేశంలో భద్రత కల్పించే సామర్థ్యం తాలిబాన్లకు లేదని నిరూపించడమే ఈ సంస్థ లక్ష్యమని పేర్కొంది. దౌత్య కార్యాలయాలపై ఉగ్ర దాడులకు పాల్పడటం ద్వారా తాలిబాన్లు, ఆయా దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు ఐఎస్‌ఐఎల్-కె కుట్రలు పన్నిందని తెలిపింది. ఐరాస ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఈ నివేదికను రూపొందించారు.





