
290views
నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని వెంగమాంబ పేరంటాల అమ్మవారి సముద్ర స్నానానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో ఉషశ్రీ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఉదయగిరి సీఐ గిరిబాబుతో కలిసి ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సముద్రస్నానం ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నర్రవాడ పురవీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందన్నారు. శనివారం ఉదయం ఊరేగింపు దుత్తలూరు మీదుగా రాత్రికి కావలిలోని శివాలయానికి చేరుకుంటుందన్నారు. ఆదివారం ఉదయం అమ్మవారికి కొత్తసత్రం సముద్రతీరం వద్ద సముద్రస్నాన మహోత్సవం ఉంటుందన్నారు.





