News

శివరాత్రి ఉత్సవాలకు పందిరి రాట

264views

శ్రీకాకుళం జిల్లా జలుమూరులో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వర ఆలయంలో ఈ నెల 18 నుంచి మూడు రోజులపాటు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం దేవదాయశాఖ అధికారులు, అర్చకులు పందిరి రాట వేశారు. గణపతిపూజ, పుణ్యాహవచనం, కంకణాదారణ, మండపారాధన చేపట్టారు. ఉత్సవాలు విజయవంతంగా సాగేందుకు అష్టదిక్పాలకులకు ఆహ్వానించి శుభ రాట వేశామని అర్చకులు తెలిపారు. అనంతరం ఉత్సవాల గోడపత్రికను దేవదాయశాఖ అధికారులు, ఆలయ పాలకమండలి సభ్యులు ఆవిష్కరించారు.