‘స్వాగత తిలకం’ వద్దన్న టీం ఇండియా బౌలర్లు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.. సోషల్ మీడియాలో మండిపడ్డ నెటిజన్లు!

నాగపూర్‌లో ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో భారత ఆటగాళ్లకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత జట్టు క్రికెటర్లకు స్వాగతం పలికే సమయంలో నుదుటన బొట్టు పెట్టి ఎయిర్‌పోర్టు నుంచి ఆహ్వానించడం చాలా సందర్భాలలో అందరూ చూసే ఉంటారు. ఇక ఇదే క్రమంలో నాగ్‌పూర్ చేరుకున్న క్రికెట్ సిబ్బందికి బొట్టు పెడుతుండగా.. మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లు బొట్టు పెట్టించుకోలేదు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సుదర్శన్ టీవీ యజమాని, చీఫ్ ఎడిటర్ సురేశ్ చవాంకే ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లను లక్ష్యంగా చేసుకోవడంతో వివాదం మొదలైంది.
‘స్వాగతం పలుకుతున్నప్పుడు నుదుటన తిలకం పెడుతుంటే సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ వద్దన్నారు. వాళ్లు ఇండియా ఆటగాళ్లు కాదు.. పాకిస్తాన్ ఆటగాళ్లు అంటూ.. విమర్శలు గుప్పించారు. ఇంటర్నేషనల్ క్రికెటర్లుగా ఎదిగినా కూడా వారు మతాన్ని వదిలిపెట్టలేదు’ అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.