News

శివరాత్రి వేడుకలకు శ్రీకాళహస్తీశ్వరాలయం ముస్తాబు

356views

శ్రీకాళహస్తి – మహాశివరాత్రి వేడుకలకు శ్రీకాళహస్తీశ్వరాలయం ముస్తాబవుతోంది. ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకు 14 రోజుల పాటు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ నిర్వహించనున్నారు. ఈ నెల 5వ తేదీన ఆదివారం స్వర్ణముఖి నదిలో త్రిశూల స్నానంతో ఉత్సవాలకు నాంది పలుకుతారు. ఇప్పటికే త్రిశూల స్నానం జరిగే ప్రదేశంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు. 18న మహాశివరాత్రి, 19 ఉదయం రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం, 20వ తేదీ అర్ధరాత్రి శివపార్వతుల కల్యాణం, 22న గిరిప్రదక్షిణ, 24న పల్లకీసేవ ఉత్సవాలు ప్రధాన ఘట్టాలు. ఆయా రోజుల్లో జరిగే ఉత్సవాలకు పెద్దఎత్తున భక్తుల రద్దీ ఉంటుంది. అందుకు అనుగుణంగా అవసరమైన భక్తులు బస చేసేందుకు షెడ్లు, ఇతర సౌకర్యాలకు ప్రదేశాలను సిద్ధం చేస్తున్నారు. ఆలయం లోపల గురువారం రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దారు. అలాగే ధ్వజస్తంభం, మహాద్వారం ప్రదేశాల్లో అద్దిన రంగులు భక్తులను ఆకట్టుకున్నాయి. వారం రోజుల ముందు నుంచే ఉత్సవాల సందడి నెలకొం